ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!

- September 30, 2026 , by Maagulf
ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!

మస్కట్: ఒమన్‌లోని సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన ఫ్యాక్టరీపై పర్యావరణ అథారిటీ (EA) చట్టపరమైన చర్యలు చేపట్టింది. ఫ్యాక్టరీ నుంచి శుద్ధి చేయని వ్యర్థ జలాలను విడుదల చేసినట్లు అధికారులు గుర్తించారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సంబంధిత ఫ్యాక్టరీపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అథారిటీ వెల్లడించింది.

పర్యావరణ వ్యవస్థలను రక్షించడంతో పాటు సహజ వనరులను పరిరక్షించేందుకు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పర్యావరణ అథారిటీ సూచించింది. పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘించే విధంగా వ్యర్థాలను విడుదల చేయకుండా, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా వ్యర్థ జలాల నిర్వహణ చేపట్టాలని అన్ని పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు అథారిటీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com