కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- September 30, 2026
కువైట్: జంతువులను వీధుల్లో లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో వదిలిపెట్టవద్దని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) జంతువుల యజమానులను హెచ్చరించింది. జంతువుల పెంపకం, సంరక్షణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
జంతువులను ఇకపై సంరక్షించలేని పరిస్థితిలో ఉన్న యజమానులు వాటిని వీధుల్లో లేదా ఇతర బహిరంగ ప్రాంతాల్లో వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారుల సమన్వయంతో జంతువులను స్వీకరించేందుకు లేదా తగిన చర్యలు తీసుకునేందుకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
విచ్చలవిడి జంతువుల కారణంగా తలెత్తే పరిస్థితులను నియంత్రించడం, ప్రజల భద్రతను మెరుగుపరచడంలో భాగంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడి కుక్కలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని, దగ్గరకు వెళ్లవద్దని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







