'డెకాయిట్' సెన్సార్ పూర్తి
- April 04, 2026
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.
ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే ‘రుబారు’ చిచ్చుబుడ్డి పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రెండు భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ సభ్యులు మూవీ టీంని అభినందించారు.
అడివి శేష్ 'డెకాయిట్' తో డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ చిత్రానికి భీమ్స్ బ్లాక్ బస్టర్ అల్బమ్ అందించారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







