ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- May 22, 2026
ఎవరెస్ట్ శిఖరం పై ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వైపు తిరిగి వస్తుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు. ఈ విషయాన్ని నేపాల్ అధికారులు వెల్లడించారు. మృతులు ఒకరు అరుణ్ కుమార్ తివారీ, మరొకరు సందీప్‌గా గుర్తించారు.
తాజాగా బుధవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు 274 మంది పర్వతారోహకుల టీమ్. అందులో ఇండియాకు చెందిన సందీప్ ఆరే, తులసి రెడ్డి, అజయ్ పాల్ సింగ్ తోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు నేపాల్ ఎక్స్‌పెడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఒక రోజులో అధిక సంఖ్యలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన టీమ్‌గా కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. అయితే, అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరే కిందకు దిగుతున్న సమయంలో తీవ్రంగా అలసిపోయారని తెలిపారు. వారిని రక్షించేందుకు గైడ్స్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరణించినవారు వేర్వేరు బృందాల్లో సభ్యులు. బుధవారం ఒకరు, గురువారం మరొకరు మృత్యువాత పడ్డారు. ఒకరు దిగుతున్న సమయంలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు బేస్ క్యాంప్‌కు వచ్చినప్పుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వీరికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







