ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- April 04, 2026
దోహా: గల్ఫ్ పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఖతార్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇటలీ రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఆమె అక్కడి నుండి దోహాకు చేరుకుంటారు. ఖతార్ పర్యటన అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి బయలుదేరి వెళతారు.
మిడిలీస్టులో అమెరికా,ఇజ్రాయెట్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 లేదా G20 కూటమికి చెందిన ఒక దేశాధినేత గల్ఫ్ ప్రాంతంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ఇటలీ మరియు ఖతార్ దేశాల మధ్య రాజకీయ-దౌత్య, సైనిక-రక్షణ, ఇంధన, వాణిజ్య, ప్రత్యక్ష పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి మరియు క్రీడలతో సహా అన్ని రంగాలలో బలమైన స్నేహాన్ని మరియు బలమైన బంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఇటలీ రాయబార కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. ప్రధాన మంత్రి మెలోని తన పదవీకాలంలో ఖతార్‌లో పర్యటించడం ఇది రెండవ అధికారిక పర్యటన అని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్









