అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- April 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పనుల వేగాన్ని పెంచడంపై అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు.
రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు వారం, నెల వారీగా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే పూర్తి చేయాల్సిన కీలక పనులపై అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే కార్మికుల సంఖ్య పెంచుకోవాలని, ఎక్కడా జాప్యం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







