అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్

- April 04, 2026 , by Maagulf
అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్

న్యూ ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై సామాన్యుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం శనివారం (ఏప్రిల్ 4, 2026) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా చిన్న తరహా వినియోగదారులకు ఊరటనిస్తూ ఎల్పీజీ (LPG) నిబంధనలను సరళతరం చేసింది.

వలస కూలీలు, విద్యార్థులు, చిన్న కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది:ఇకపై 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ కొనుగోలుకు ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ (చిరునామా ధృవీకరణ) అవసరం లేదు.కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (Aadhaar, Voter ID, etc.) చూపిస్తే సరిపోతుంది.మీ సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళన చెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ ఔట్‌లెట్లు సాధారణంగా పనిచేస్తున్నాయని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com