గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- April 05, 2026
హైదరాబాద్: తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిద్దడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది.ఈ సమావేశంలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పై బోర్డు సభ్యులతో ముఖ్యమంత్రి చర్చించారు. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఉండేలా సమీకృత క్రీడా కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియంను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఇండోర్ స్టేడియం, ఔట్ డోర్ స్టేడియం, శిక్షణ పొందేందుకు అత్యాధునిక ప్రపంచస్థాయి మౌళిక వసతులతో గచ్చిబౌలి స్టేడియంను తీర్చి దిద్దాలని తెలిపారు.అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్స్, ఫుట్ బాల్ స్టేడియం నిర్మించాలన్నారు.అన్ని రకాల క్రీడలకు శిక్షణ అందించేలా శిక్షణ కేంద్రాలను నిర్మించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎం బోర్డు సభ్యులకు వివరించారు.
సీఎస్ ఆర్ నిధులతో గచ్చిబౌలి స్టేడియంను అత్యద్భుతంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని కోరారు.దేశంలోనే బెస్ట్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు.స్టేడియం అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టే వారికి అవసరమైతే వారి బ్రాండింగ్ ను ప్రోత్సహించుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.క్రీడల్లో హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చి దిద్దాలన్నారు. జూన్ 2లోగా ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్ తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.ఎయిర్ పోర్ట్ నుంచి క్రీడా కారులు నేరుగా హెలికాప్టర్ లో స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు ఉండాలని, భవిష్యత్ లో స్టేడియం నిర్వహణకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించి ఆర్కిటెక్చర్ ను నియమించామని, స్టేడియం అభివృద్ధిపై బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీర్ఘ కాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్యమారన్, సంజీవ్ గోయెంకా, సి. శశిధర్, క్రీడాశాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోనీ బాలా దేవి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







