ఇరాన్‌లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- July 15, 2026
ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బంపూర్‌లోని సైనిక స్థావరంపై అమెరికా దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది.
దాడుల్లో గరిష్ఠ ప్రాణనష్టం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరాన్ సైన్యం ఆరోపించింది. మొత్తం 13 క్షిపణులు దక్షిణ ఇరాన్‌లోని ఇరాన్‌షహర్ నగర సమీపంలోని సైనిక స్థావరంపై పడ్డాయని పేర్కొంది. ఈ దాడుల్లో గెస్ట్‌హౌస్, గార్డు పోస్టులు, సైనికుల నివాస సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలిపింది.
ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. అమెరికా దాడికి “నిర్ణయాత్మక ప్రతిస్పందన” ఇస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







