వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!

- April 08, 2026 , by Maagulf
వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!

కువైట్: రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ గార్డ్ మరియు కువైట్ ఫైర్ ఫోర్స్ జారీ చేసిన ఆదేశాలను పౌరులు, నివాసితులు కచ్చితంగా పాటించాలని కువైట్ క్యాబినెట్ పిలుపునిచ్చింది. వివిధ ప్రదేశాల ఫోటోలు లేదా వీడియోలను నమ్మొవద్దని, అదే సమయంలో వాటిని షేర్ చేయవద్దని, వదంతులను వ్యాప్తి చేయకుండా ఉండాలని ప్రజలను కోరింది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశంలో ఈ మేరకు  పిలుపునిచ్చారు. 

సమావేశం అనంతరం, ఉప ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షరీదా అల్-మౌషెర్జీ మాట్లాడుతూ..  ఇరాన్ దాడుల కారణంగా కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా కువైట్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతును తెలిపిందన్నారు. ఇందుకు సంబంధించి కింగ్ చార్లెస్ III నుండి హిజ్ హైనెస్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు ఒక లెటర్ రాసినట్లు పేర్కొన్నారు. 

అలాగే, యుకె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ నుండి హిజ్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-సబా ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారని తెలిపారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిండంతోపాటు కువైట్‌కు సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. 

దీంతోపాటు కువైట్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో తాజా ప్రాంతీయ పరిణామాలు మరియు కొనసాగుతున్న సైనిక పరిస్థితిపై రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సలేం అల్-సబా క్యాబినెట్ కు వివరించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com