24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- April 08, 2026
రియాద్: నిబంధనల ఉల్లంఘనలకు గాను జరిమానాలు విధించే ముందే, వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తూ 24,000కు పైగా రవాణా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు రవాణా సాధారణ అథారిటీ (TGA) తెలిపింది. గత మార్చి నెలలో దేశవ్యాప్తంగా భూమార్గం, సముద్రమార్గం మరియు రైలు రవాణా కార్యకలాపాలపై 434,000కు పైగా తనిఖీలు నిర్వహించిన అనంతరం ఈ మేరకు చర్యలు చేపట్టారు. రవాణా కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడం, అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం , రవాణా రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా అథారిటీ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో ఇది ఒక భాగమన్నారు.
అథారిటీ పర్యవేక్షణ గణాంకాల ప్రకారం.. అధికారులు భూ రవాణా రంగంలో 425,874కు పైగా తనిఖీలను, సముద్ర రవాణా రంగంలో 8,268కు పైగా తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యకలాపాల్లో రైలు రవాణా రంగానికి చెందిన 77 స్టేషన్ల సందర్శనలు కూడా ఉన్నాయి. భూ రవాణా రంగంలో నిబంధనల పాటించే రేటు (compliance rate) 91 శాతంగా, సముద్ర రవాణా రంగంలో సుమారు 99 శాతంగా, కాగా రైలు రవాణా రంగంలో 100 శాతంగా నమోదైనట్లు TGA వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







