అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- April 08, 2026
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ప్రకటించిన కాల్పుల విరమణపై భారతదేశం తొలిసారిగా స్పందించింది. బుధవారం (ఏప్రిల్ 8, 2026) నాడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కాల్పుల విరమణ పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్‌సోషల్’ (Truth Social) ద్వారా ఈ కాల్పుల విరమణను ప్రకటించారు. గత నెల రోజులకు పైగా సాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు మొగ్గు చూపడం విశేషం.
ఉద్రిక్తతలకు చర్చల ద్వారా పరిష్కారం లభించాలని భారతదేశం మొదటి నుంచీ వాదిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ప్రస్తుత సంఘర్షణకు త్వరితగతిన ముగింపు పలకడానికి ఉద్రిక్తతలను తగ్గించడం అత్యవసరం అని, శాంతిని నెలకొల్పడానికి చర్చలు, దౌత్యం కీలకమని మేము నిరంతరం చెబుతూనే ఉన్నాము” అని ఆ ప్రకటనలో తెలిపారు.నెల రోజులకు పైగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ వల్ల జరిగిన నష్టంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగింది. పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాలు, ప్రపంచ వాణిజ్యం ఇకపై కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
Statement on the recent development in West Asia ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 8, 2026
🔗 https://t.co/WwFCi4kXHg pic.twitter.com/wmsF4YUb7j
తాజా వార్తలు
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు







