అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్

- April 08, 2026 , by Maagulf
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్

 అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణానికి తెరదించుతూ ప్రకటించిన కాల్పుల విరమణపై భారతదేశం తొలిసారిగా స్పందించింది. బుధవారం (ఏప్రిల్ 8, 2026) నాడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కాల్పుల విరమణ పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఉదయం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్‌సోషల్’ (Truth Social) ద్వారా ఈ కాల్పుల విరమణను ప్రకటించారు. గత నెల రోజులకు పైగా సాగుతున్న ఈ ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు మొగ్గు చూపడం విశేషం.

ఉద్రిక్తతలకు చర్చల ద్వారా పరిష్కారం లభించాలని భారతదేశం మొదటి నుంచీ వాదిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ప్రస్తుత సంఘర్షణకు త్వరితగతిన ముగింపు పలకడానికి ఉద్రిక్తతలను తగ్గించడం అత్యవసరం అని, శాంతిని నెలకొల్పడానికి చర్చలు, దౌత్యం కీలకమని మేము నిరంతరం చెబుతూనే ఉన్నాము” అని ఆ ప్రకటనలో తెలిపారు.నెల రోజులకు పైగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ వల్ల జరిగిన నష్టంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు, వాణిజ్య నెట్‌వర్క్‌లకు అంతరాయం కలిగింది. పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరాలు, ప్రపంచ వాణిజ్యం ఇకపై కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com