పచ్చిరొయ్యలు గుడ్లు కూర..
- August 04, 2016
గుడ్లు : ఆరు
పచ్చిరొయ్యలు : పావుకేజీ
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాలా : అర టీ స్పూన్
చింతపండు : నిమ్మకాయంత
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా
టమాటాలు : రెండు
తయారుచేయు విధానం :
1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. పచ్చిరొయ్యలు లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మగ్గిన తరువాత పచ్చిరొయ్యలు వేసి కలిపి ఒకనిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







