రాత్రి నేపథ్యంలో మహేష్‌బాబుపై ఓ పోరాట సన్నివేశo..

- August 04, 2016 , by Maagulf
రాత్రి నేపథ్యంలో మహేష్‌బాబుపై ఓ పోరాట సన్నివేశo..

మ హేష్‌బాబు కథానాయకుడిగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఠాగూర్‌ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రాత్రి నేపథ్యంలో మహేష్‌బాబుపై ఓ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. రాత్రి 8 గంటలకు మొదలై... తెల్లవారుఝామున 4 గంటల వరకూ నిరాటంకంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ పోరాట ఘట్టానికి అనల్‌ అరసు నేతృత్వం వహిస్తున్నారు. ఈ నెల 12 వరకూ ఇక్కడే షూటింగ్‌ నిర్వహిస్తారు. చెన్నైలోనూ కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించే చిత్రమిది. ఈ నెల 9న మహేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com