డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి..
- April 14, 2026
భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి నేడు. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ ప్రాంతంలో రాంజీ మకోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు భీమ్‌రావు రామ్‌జీ అంబేద్కర్.
ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన భీమ్‌రావు, చిన్నప్పటి నుంచే కుల వివక్షను అత్యంత దారుణంగా ఎదుర్కొన్నారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో సమానంగా కూర్చునే అవకాశం లేకపోయినా, చదువు ద్వారానే తన జీవితాన్ని, సమాజాన్ని మార్చగలనని ఆయన బలంగా నమ్మారు. ఆ పట్టుదలే ఆయనను ఉన్నత విద్య వైపు నడిపించింది.
కుటుంబ నేపథ్యం మరియు సామాజిక పరిస్థితులను అధిగమించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన తొలి తరం భారతీయుల్లో ఆయన ఒకరు. విదేశీ గడ్డ పై పొందిన జ్ఞానం, అక్కడ ఎదురైన అనుభవాలు ఆయనను సామాజిక మార్పు కోసం పోరాడేలా పురికొల్పాయి. అంటరానితనం, కుల వివక్ష లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి నిరుపమానం. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అజరామరం.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!
- గల్ఫ్ టూరిజం రికవరీకి కీలక నిర్ణయాలు..!!
- దుబాయ్‌లో ఒడిశా వైవిధ్యాన్ని చాటిచెప్పిన ODOP ప్రదర్శన







