ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...

- August 05, 2016 , by Maagulf
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌జిల్లా కోమటిబండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో 2లక్షల మంది కూర్చునేలా, వాహనాల పార్కింగ్‌ కోసం 4 అప్రోచ్‌రోడ్లు, సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com