'కబాలి' సినిమా ఫైట్ మాస్టర్స్ మహేష్ సినిమా కి ..
- August 05, 2016
'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తో నిరాశగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబుకు మరో డిజాస్టర్ మూవీ 'కబాలి' కి పనిచేసిన కొంత మంది పనిచేయడం హాట్ న్యూస్ గా మారింది. మురుగదాస్ దర్శకత్యంలో లేటెస్ట్ గా మహేష్ నటిస్తున్న సినిమాకు 'కబాలి' సినిమాకు సంబంధించి ఇద్దరు టెక్నీషియన్లను తీసుకున్నారు.టాలీవుడ్ లో రామ్, లక్ష్మణ్ బ్రదర్స్ మాదిరిగా కోలీవుడ్ లో అన్బు, అరసు అనే ఇద్దరు ఫైట్ మాస్టర్లు ఉన్నారు. వాళ్లిద్దరూ కూడా కవల సోదరులే ప్రస్తుతం కోలీవుడ్ సినిమా రంగంలో వీరిద్దరూ బెస్ట్ ఫైట్ మాస్టర్స్ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసింది కూడా ఈ ఫైట్ మాస్టర్స్ అన్న విషయం చాలమందికి తెలియదు.
ప్రస్తుతం ఈ ట్విన్ బ్రదర్స్ మహేష్ మురుగ సినిమాకు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో నైట్ ఎఫెక్టులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు మురగదాస్ చిత్రీకరిస్తున్నాడు అన్బు- అరసు ఈసినిమా కోసం స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం మహేష్ మంచి క్లాసు లుక్ లో తయారు అయ్యాడు. ప్రస్తుతం ఆ లుక్ లోనే మహేష్ ఫైట్ లు చేస్తున్నాడు. మహేష్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ ఫైట్లు ఉంటాయని మురగదాస్ మీడియాకు లీక్ లు ఇస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న పదిరోజుల షెడ్యూల్ పూర్తయ్యాక ఈచిత్ర యూనిట్ పుణె ముంబాయి నగరాలకు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళబోతోంది. ఆ తరువాత ఈసినిమా భారీ షెడ్యూల్ గుజరాత్ లో ప్లాన్ చేస్తున్నారు. సుమారు 100 కోట్ల భారీబడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ మొట్టమదటి సారి మహేష్ పక్కన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం పై మహేష్ నెంబర్ వన్ స్థానం ఆధారపడి ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







