'కబాలి-2'కి సన్నద్ధమవుతున్న దర్శకుడు..
- August 05, 2016
వసూళ్ల పరంగా బాక్సాఫీసు దగ్గర ప్రకంపనలు సృష్టించిన చిత్రం 'కబాలి'. చాలా రోజుల తర్వాత రజనీకాంత్ స్టామినాని గుర్తు చేసిన చిత్రంగానూ నిలిచింది. మొదట కథపై విమర్శకులు పెదవి విరిచినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం సినిమా దుమ్ము రేపింది. ఆ ఉత్సాహంలో దర్శకుడు పా.రంజిత్ 'కబాలి-2'కి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. రజనీకాంత్ కూడా అందుకు పచ్చజెండా వూపేశాడు. 'కబాలి' కథని కూడా సీక్వెల్‌కి అనుగుణంగానే ముగించారు. అంటే సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే రజనీ, పా.రంజిత్ మధ్య సీక్వెల్ గురించి చర్చ జరిగుంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించడంతో 'కబాలి2' ఖాయమేనని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. పా.రంజిత్ తదుపరి సూర్య కథానాయకుడిగా '5.35' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆ చిత్రం తర్వాతే 'కబాలి2' సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలుస్తోంది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!