ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- April 15, 2026
అబూదాబి: ప్రభుత్వ, ప్రైవేట్ నర్సరీలు, కిండర్గార్టెన్లు మరియు పాఠశాలల్లో నమోదు అయిన పిల్లలు, విద్యార్థులు, బోధనా సిబ్బంది, పరిపాలనా సిబ్బందికి 2026 ఏప్రిల్ 20 సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులు (In-Person Learning) పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.
విద్యాసంస్థలు అవసరమైన సన్నాహక ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భవనాల సిద్ధత, బోధనా మరియు పరిపాలనా సిబ్బందికి శిక్షణ, భద్రతా మరియు రక్షణ విధానాల నవీకరణ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపింది. దీని ద్వారా విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు సురక్షితమైన, నమ్మకమైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొంది.
అదేవిధంగా, అవసరమైతే ప్రైవేట్ పాఠశాలలు హైబ్రిడ్ రోటేషనల్ మోడల్ అమలు చేసుకునే సౌలభ్యం ఉంటుందని, ఇది ఆమోదించిన నిబంధనల ప్రకారం స్థానిక విద్యా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతి విద్యాసంస్థ సిద్ధతను పరిగణనలోకి తీసుకుని సాఫీగా అమలు చేసేలా చర్యలు ఉంటాయని తెలిపింది.
హైబ్రిడ్ విధానం అమలు చేసే పాఠశాలలు సిబ్బంది విధులను సమర్థవంతంగా కేటాయించాలని, ఒకే ఉపాధ్యాయుడు ఒకేసారి ప్రత్యక్ష మరియు ఆన్లైన్ బోధన నిర్వహించాల్సిన పరిస్థితి లేకుండా చూసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. దీని ద్వారా విద్యా నాణ్యతను కాపాడటంతో పాటు ఉపాధ్యాయుల పనిభారాన్ని సమతుల్యం చేయడం సాధ్యమవుతుందని వివరించింది.
అవసరమైతే విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ బోధన విధానాలకు వేగంగా మారేందుకు కూడా సిద్ధంగా ఉంటాయని, విద్య నిరంతరతకు ఎలాంటి అంతరాయం లేకుండా సౌలభ్యంతో ముందుకు సాగుతామని విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







