కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- April 17, 2026
అబుదాబిః యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూఏఈకి నూతనంగా నియమితులైన పలువురు రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించి, వారికి స్వాగతం పలికారు. యూఏఈ మరియు వారి సంబంధిత దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు మద్దతునిచ్చే విధంగా సహకారాన్ని బలోపేతం చేయడంలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి అవసరమైన పూర్తి సహకారం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యూఏఈ దీర్ఘకాలిక విధానం, తమ ప్రజల మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాలను నిర్మించడంపైనే ఆధారపడి ఉందని కూడా ఆయన చెప్పారు.
జింబాబ్వే రాయబారి ఐజాక్ అనానియాస్ మోయో, థాయిలాండ్ రాయబారి బోల్‌బాంగ్‌సే వాంగ్‌ఫేన్, చైనా రాయబారి జెంగ్ జిక్సిన్ లు యూఏఈ ప్రెసిడెండ్ కు క్రెడెన్షియల్స్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ స్పెషల్ అఫైర్స్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హమ్‌దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ ప్రెసిడెంట్ సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









