చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు

- April 17, 2026 , by Maagulf
చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు క్రీడా లోకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న తన స్నేహితుడిని ఆదుకోవడానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు మాజీ క్రీడాకారులు ముందుకు రావడం విశేషం.

కాంబ్లీకి అత్యంత సన్నిహితుడైన మాజీ అంపైర్ మార్కస్ కౌటో ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. ఇందులో సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సభ్యులుగా ఉన్నారు.కేవలం డబ్బు మాత్రమే కాకుండా, కాంబ్లీ మానసికంగా కుంగిపోకుండా మాజీ క్రికెటర్లు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.ఈ గ్రూప్ సభ్యులు తమ పేర్లు బయటకు రాకుండా కాంబ్లీ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

మార్కస్ కౌటో తెలిపిన వివరాల ప్రకారం.. కాంబ్లీ ప్రస్తుతం తీవ్రమైన మతిమరుపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. “ఆయనకు పూర్తి స్థాయిలో మతిమరుపు రాలేదు కానీ, సాధారణ విషయాలను గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కొన్నిసార్లు విషయాలు గుర్తొస్తాయి, మరుక్షణమే మరచిపోతారు. గత ఆరు నెలలుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది” అని కౌటో ఆవేదన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com