ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- April 18, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను ప్రతి కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ భాగస్వామిగా భవ్య హెల్త్ సర్వీస్ (Bhavya Health Service) ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్ సర్వీస్ గత 10 నెలల్లో అసాధారణ పనితీరు కనబరిచింది. జూన్ 2025 నుండి మార్చి 2026 మధ్య కాలంలో మొత్తం 6,39,809 అత్యవసర కేసులకు తక్షణం స్పందించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు అత్యుత్తమ అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న భవ్య హెల్త్ సర్వీస్, గత 10 నెలల్లో అత్యంత సమర్థవంతంగా సేవలందించి వేలాది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది. అత్యాధునిక సాంకేతికత, అంకితభావంతో కూడిన సిబ్బందితో మారుమూల ప్రాంతాల్లో కూడా 'గోల్డెన్ అవర్'లో వైద్య సహాయం అందిస్తూ రాష్ట్ర ఆరోగ్య రంగంలో నమ్మకమైన భాగస్వామిగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా అందిన కాల్స్ లో ప్రధానంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటంలో భవ్య హెల్త్ కేర్ బృందం కీలకంగా వ్యవహరించింది.
- ప్రమాద బాధితుల రక్షణ: 92,372 రోడ్డు ప్రమాద కేసులు, 40,450 ఇతర ప్రమాద (Trauma) కేసుల్లో తక్షణ వైద్యం అందించారు.
- మాతృ-శిశు రక్షణ: 87,320 మంది గర్భిణీ స్త్రీలకు మరియు 11,614 మంది నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా, అత్యవసర చికిత్స అందించారు.
- గుండె సంబంధిత అత్యవసరాలు: ముఖ్యంగా గత మూడు నెలల్లోనే 9,183 మంది గుండెపోటు బాధితులను 'గోల్డెన్ అవర్'లో ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెట్టారు.
సాంకేతికత మరియు సౌకర్యాలు
భవ్య హెల్త్ కేర్ తన సేవల నాణ్యతను పెంచేందుకు పలు కీలక మార్పులు చేపట్టింది.
1. ఫ్లీట్ అప్‌గ్రేడేషన్: పాత వాహనాల స్థానంలో అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 190 కొత్త అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మొత్తం 731 వాహనాలు నిరంతరం అందుబాటులో ఉన్నాయి.
2. అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS): ప్రతి అంబులెన్స్‌లో వెంటిలేటర్లు, డెఫిబ్రిలేటర్లు ఆక్సిజన్ సపోర్ట్ వంటి సౌకర్యాలతో పాటు శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (EMT) అందుబాటులో ఉంటారు.
3. 24/7 కంట్రోల్ రూమ్: అత్యాధునిక జీపీఎస్ (GPS) టెక్నాలజీ ద్వారా అంబులెన్స్‌లను ట్రాక్ చేస్తూ, కాల్ అందిన వెంటనే తక్కువ రెస్పాన్స్ టైమ్‌లో బాధితుల వద్దకు చేరుకునేలా వ్యవస్థను రూపొందించారు.
సేవల విభజన
- డైరెక్ట్ రెస్పాన్స్ (Non-IFT): 4,33,242 మందిని నేరుగా ప్రమాద స్థలాల నుండి తరలించారు.
- హాస్పిటల్ ట్రాన్స్‌ఫర్ (IFT): మెరుగైన చికిత్స కోసం 2,06,567 మందిని ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ విధానం ద్వారా, అంబులెన్స్‌లో ఏర్పాటు చేయబడిన CCTV కెమెరాలు, మొబైల్ డేటా టెర్మినల్స్ (MDT) సాయంతో 18 మంది ప్రత్యేక వైద్యుల బృందం లైవ్‌గా బాధితుల స్థితిని పర్యవేక్షిస్తూ, ఆసుపత్రికి చేరకముందే అవసరమైన చికిత్సలు అందిస్తోంది.
సకాలంలో స్పందించే రెస్పాన్స్ టైమ్, అత్యాధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో ఘటనా స్థలాల నుండి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రుల మధ్య తరలింపుల్లో భవ్య హెల్త్ కేర్ అంకితభావంతో నిరంతరం పనిచేస్తోంది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే 108కి డయల్ చేసి ఈ ఉచిత, ప్రాణరక్షక సేవను వినియోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాము.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









