సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!

- April 18, 2026 , by Maagulf
సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సమైల్ విలాయత్‌లోని నడిరోడ్డు పై ఒక వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.సమాచారం అందుకున్న పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి.

ఈ అగ్నిప్రమాదాన్ని తక్షణమే ఆర్పివేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను ముందే గ్రహించిన డ్రైవర్, ప్రయాణికులు కారు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com