రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- April 18, 2026
మనామా: మిడిలీస్టులో నెలకొన్న సంక్షోభం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని బహ్రెయిన్ ఆర్థిక మంత్రి హెచ్.ఇ. షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి సమావేశాలలో పాల్గొన్నారు. గల్ఫ్ సహకార మండలి దేశాలు, జోర్డాన్ లక్ష్యంగా జరిగిన దాడులను తీవ్రమైనవిగా అభివర్ణించారు. ఈ దాడులు పౌర మరియు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు.
"నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, వాణిజ్య భవనాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, చమురు మరియు గ్యాస్ మౌలిక సదుపాయాలు, ఇతర కీలక సౌకర్యాలు దెబ్బతిన్నాయి." అని ఆయన అన్నారు. ఈ దాడుల ఫలితంగా ప్రాణనష్టం, గాయాలు, మరియు విస్తృతమైన నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాంత రక్షణలో అండగా నిలిచిన మిత్రదేశాలకు, అలాగే అమెరికా, ఇతర ప్రపంచ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధికి అంతరాయం కలిగించే ఏ ప్రయత్నాలనైనా "ఆర్థిక ఉగ్రవాదం"గా అభివర్ణించారు. ఈ జలమార్గం ద్వారా ప్రపంచంలోని 20 శాతానికి పైగా చమురు మరియు ద్రవీకృత సహజ వాయువుతో పాటు అల్యూమినియం , ఎరువుల ఎగుమతులు జరుగుతాయని ఆయన గుర్తుచేశారు.
ఏదైనా దీర్ఘకాలిక అంతరాయం దశాబ్దాలలో ప్రపంచ సఫ్లై చైన్ లను విఘాతం కలిగించగలదని ఆయన హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 ఆమోదాన్ని షేక్ సల్మాన్ ఒక "చారిత్రాత్మక" చర్యగా అభివర్ణించారు. భద్రతా, ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కోవడానికి మరింత బలమైన అంతర్జాతీయ సహకారం కావాలని పిలుపునిచ్చారు.
లెబనాన్లో శాశ్వత కాల్పుల విరమణ, గాజాలో మెరుగైన మానవతా పరిస్థితుల దిశగా చేసే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ దౌత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో ప్రపంచ సంస్థలు తమ మద్దతును పెంచాలని షేక్ సల్మాన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









