ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!

- April 18, 2026 , by Maagulf
ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!

టెహ్రాన్: ఇరాన్ తన భూభాగంలోని తూర్పు భాగం గుండా వెళ్లే అంతర్జాతీయ విమానాల కోసం శనివారం తన గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరిచిందని ఆ దేశ పౌర విమానయాన సంస్థ (సివిల్ ఏవియేషన్ అథారిటీ) తెలిపింది.

"ఇరాన్ గుండా ప్రయాణించే అంతర్జాతీయ విమానాల కోసం దేశ గగనతలంలోని తూర్పు భాగంలో విమాన మార్గాలు తెరిచి ఉన్నాయి." అని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 7:00 గంటలకు (0330 GMT) కొన్ని విమానాశ్రయాలు కూడా తిరిగి తెరుచుకున్నాయని తెలిపింది.

అయితే, ఈ ప్రకటన వచ్చిన మూడు గంటల తర్వాత కూడా ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్లు ఇరాన్ గుండా ఏ అంతర్జాతీయ విమానాలు వెళ్లడం లేదని, చాలా విమానాలు ఇరాన్ గగనతలానికి దూరంగా వెళుతున్నట్లు చూపించడం గమనార్హం.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com