స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్

- April 18, 2026 , by Maagulf
స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా సంస్థ తన సిబ్బందిని తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి మొదటి దశలో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం.

సంస్థలో ప్రస్తుతం దాదాపు 6,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే మొత్తం సిబ్బందిలో సుమారు 20 శాతం మంది పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో సంస్థ వద్ద సుమారు 50 విమానాలు ఉండగా ప్రస్తుతం కేవలం 13 విమానాలు మాత్రమే ఉన్నాయి. నిర్వహణ సామర్థ్యం తగ్గడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్పనిసరి అయిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

సంస్థలో చాలా మంది ఉద్యోగులను వేతనం లేని సెలవులపై పంపిస్తున్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కొందరికి జీతాలు ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పటికే సుమారు 62 మంది ఇంజనీర్లను విధుల నుంచి తొలగించారు. సుమారు ₹4500 కోట్ల బకాయిలతో కంపెనీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సరైన సమయంలో పెట్టుబడులు రాకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com