సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- April 19, 2026
రియాద్: గత వారం రోజుల్లో మొత్తం 14,487 మంది అక్రమ నివాసితులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 15 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఈ అరెస్టులు జరిగినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శా వెల్లడించింది.
అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 7,911 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 3,588 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 2,988 మంది ఉన్నారు. అలాగే 12,554 మంది ఉల్లంఘనదారులను దేశం నుండి బహిష్కరించారు.
ఇక, రాజ్యంలోకి సరిహద్దు దాటి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ అరెస్టు అయిన వారి సంఖ్య మొత్తం 1,382. వీరిలో 38 శాతం మంది యెమెన్ పౌరులు, 61 శాతం మంది ఇథియోపియా పౌరులు మరియు ఒక శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.
ఉల్లంఘనదారులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడంలో ప్రమేయం ఉన్న సుమారు 23 మందిని కూడా అధికారులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం మొత్తం 39,258 మంది విదేశీయులు (ప్రవాసులు)ఉండగా, వీరిలో 35,460 మంది పురుషులు మరియు 3,798 మంది మహిళలు ఉన్నారు.
రాజ్యంలోకి వ్యక్తులు అక్రమంగా ప్రవేశించడానికి ఎవరైనా సహకరించినా లేదా మరే ఇతర సహాయం అందించినా... అటువంటి వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (SR) వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 నంబర్‌కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు ఫోన్ చేసి, ఏవైనా ఉల్లంఘన కేసులు కనిపిస్తే తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones







