కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- April 19, 2026
కువైట్: కువైట్ లో రాబోయే రెండు రోజులపాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం వరకు అస్థిర వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని, ఆ తర్వాత మరో రెండు రోజులపాటు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రమదాన్ తెలిపారు.
కువైట్ లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని,ఉరుములతో కూడిన వర్షాలు, అడపాదడపా వర్షాలతో కూడిన అస్థిర వాతావరణం ఉందని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం నుండి వర్షం కురిసే అవకాశం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాత్రి మరియు తెల్లవారుజామున గాలుల తీవ్రత పెరిగి, సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుందని రమదాన్ తెలిపారు. మంగళవారం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచనలను ఫాలో కావాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







