ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- April 19, 2026
మనామా: ఇరాన్ చట్టవిరుద్ధమైన దురాక్రమణ ఫలితంగా కలిగిన అన్ని నష్టాలకు ఇరాన్ నుంచి పూర్తి నష్టపరిహారం ఇప్పించాలని ఐక్యరాజ్యసమితికి బహ్రెయిన్ తన పదకొండవ అధికారిక లేఖలో డిమాండ్ చేసింది.
బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ జరిపిన చట్టవిరుద్ధమైన దాడుల గురించి మండలి సభ్యులకు తెలియజేయడానికి ఉద్దేశించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల పరంపరను కొనసాగించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో బహ్రెయిన్ శాశ్వత మిషన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఈమేరకు భద్రతా మండలి అధ్యక్షుడికి లెటర్ ను సమర్పించారు.
బహ్రెయిన్, గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు మరియు జోర్డాన్‌పై ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలని నిర్ధారించి, వాటిని తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఇరాన్ పట్టించుకోవడం లేదని తెలిపారు.
ఫిబ్రవరి 28 నుండి బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు తమ రాజ్యం గగనతలం, ప్రాదేశిక జలాలు మరియు భూభాగాన్ని లక్ష్యంగా చేసుకున్న 194 బాలిస్టిక్ క్షిపణులను, 523 శత్రు డ్రోన్‌లను అడ్డుకున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించింది. దాడులకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలని బహ్రెయిన్ డిమాండ్ చేసింది. అలాగే, అంతర్జాతీయ చట్టాలను అమలు చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







