సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- July 27, 2026
అబుదాబి: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ చమురు సౌకర్యాలు, రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ భూభాగం నుంచి జరిపిన శత్రు డ్రోన్ దాడి యత్నాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్రంగా ఖండించింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) విడుదల చేసిన ప్రకటనలో, ఈ దాడి ప్రయత్నాలు సౌదీ అరేబియా సార్వభౌమాధికారంపై జరిగిన స్పష్టమైన ఉల్లంఘన మాత్రమే కాకుండా, ఆ దేశ భద్రత, స్థిరత్వానికి ముప్పుగా నిలుస్తాయని పేర్కొంది.
సౌదీ అరేబియా భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు చేపట్టే అన్ని చర్యలకు యూఏఈ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో సౌదీ అరేబియాతో తమ ఐక్యత కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రాంతీయ శాంతి, భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని యూఏఈ పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యలను అంతర్జాతీయ సమాజం సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా పునరుద్ఘాటించింది.
సౌదీ అరేబియాపై జరిగిన ఈ డ్రోన్ దాడి యత్నాన్ని గల్ఫ్ ప్రాంత దేశాలు అత్యంత ఆందోళనతో గమనిస్తున్న నేపథ్యంలో, యూఏఈ తన మిత్రదేశమైన సౌదీకి మరోసారి పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహనదారులకు గుడ్‌న్యూస్..!!
- ఒమన్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలు పునరుద్ధరణ..!!
- ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!
- యూఏఈ స్కూళ్లలో కఠిన నిబంధనలు.. హెయిర్‌స్టైల్, హూడీలు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఆంక్షలు..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- GCC దేశాల బ్యాంకింగ్ సహకారం మరింత బలోపేతం..!!
- సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!
- కువైట్‌లో కీలక రహదారి 5 రోజులపాటు మూసివేత..!!
- మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!
- అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్







