కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- April 20, 2026
తెలంగాణ: దాదాపు ఏడాది విరామం తర్వాత బహిరంగ సభలో ప్రత్యక్షమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తనదైన శైలిలో రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమైతే కాలం ఎవరినీ క్షమించదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.తన రాజకీయ చావును కోరుకునే వారికి తాను లొంగే వ్యక్తిని కాదని, ప్రజల కోసం వెయ్యి జన్మలైనా పోరాడతానని ఉద్వేగంగా ప్రకటించారు.మేడిగడ్డ ప్రాజెక్టులో వచ్చిన చిన్న సాంకేతిక లోపాలను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, కానీ అదే ప్రాజెక్టు గత రెండేళ్లలో అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన విషయాన్ని విస్మరించడం అవివేకమని ఆయన విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న వివక్షను, 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో గుర్తు చేశారు. పదేళ్ల గులాబీ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, అభివృద్ధి ఫలాలను ప్రజల ఇంటింటికీ చేరవేర్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక చేతులెత్తేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళ్తోందని ఆరోపించిన ఆయన, ప్రజల పక్షాన తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సీనియర్ నేత జీవన్ రెడ్డిని తన ‘అన్న’గా సంబోధిస్తూ కేసీఆర్ ఆయనకు పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత కల్పించారు. సభ వేదికగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. జగిత్యాల నుండే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జీవన్ రెడ్డి అనుభవం పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసేందుకు దిక్సూచిలా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్న జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల గడ్డ పూర్తిగా గులాబీమయమైందని, ఈ పరిణామం రానున్న రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేయబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







