కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- July 26, 2026
కౌలాలంపూర్, మలేషియా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ఇచ్చిన “Gift A Smile” పిలుపుకు స్పందిస్తూ బీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేడుకలు, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు బదులుగా సమాజంలో అవసరమైన వారికి చేయూతనివ్వాలనే కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా, మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఉన్న ఓ అనాథ శరణాలయంలో చిన్నారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అనాథ చిన్నారులకు పండ్లు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు, శరణాలయ నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించారు. చిన్నారులతో ఆప్యాయంగా గడుపుతూ, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న కేటీఆర్ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ మలేషియా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపకులు చిట్టి చిరుత, ఉపాధ్యక్షుడు అరుణ్ మునిగల, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కమిటీ సభ్యులు సత్యనారాయణరావు నడిపెల్లి, హరీష్ గుడిపాటి, సురేష్, శ్యామ్, పూర్ణచందర్ రావు, క్రాంతి, అభినయ్, కృష్ణ, సందీప్ గాజెంగి, గౌతమ్, శేషి, రమేష్, సందీప్ గౌడ్, సురేందర్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే కేటీఆర్ సంకల్పానికి అనుగుణంగా నిర్వహించిన ఈ “Gift A Smile” కార్యక్రమం అనాథ చిన్నారులకు ఆనందాన్ని పంచడమే కాకుండా, సేవా భావాన్ని చాటిచెప్పే ఆదర్శ కార్యక్రమంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!
- బ్రిక్స్ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ
- ఫిలిప్పీన్స్ లో బోటు ప్రమాదం..76కు చేరిన మరణాలు
- న్యూఢిల్లీలో పుతిన్‌తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ







