అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- July 26, 2026
హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆధ్వర్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబిలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు శుభవార్త. సోలార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి టామ్‌కామ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నియామకాలలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు, ఫోర్మెన్లు, అలాగే హెచ్ఎస్ఈ (HSE) ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందజేయనున్నట్లు టామ్‌కామ్ తెలిపింది.
అలాగే కంపెనీ తరఫున వసతి, రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, దీర్ఘకాలిక కెరీర్ అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొంది.
విదేశాల్లో ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగం చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు అధికారిక గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ సూచించింది.
దరఖాస్తు లింక్:http://https://forms.gle/V8vzicJ8Dcd2pa1L8
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
94400 49861, 94400 50951, 94400 51452

తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







