నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- April 20, 2026
హైదరాబాద్: హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా "కొణికి లక్స్" పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది. టాలీవుడ్ స్టార్ నటులకు, సెలెబ్రిటీకు హెయిర్ స్టైల్ చేయడంలో ఇప్పటికే ఎంతో మంచి తెచ్చుకున్నా రామ్ కొనికి ఇప్పుడు డెర్మటాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య రెడ్డి నేతత్వంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారి చేత ఎంతో ఆధునిక టెక్నాలజీ తో సర్టిఫైడ్ పరికరాల ద్వారా పర్సనల్ కేర్ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం స్కిన్ కేర్ తీసుకునే దిశగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో నటుడు జగపతిబాబు చేతుల మీదగా సలూన్ కొణికి వద్దనే ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా నటుడు జగపతిబాబు మాట్లాడుతూ..."నాకు రామ్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ లెజెండ్ చిత్రం నుండి నా ప్రయాణం మొదలైంది.అప్పటి నుండి నా ప్రతి హెయిర్ స్టైల్ రామ్ చేసిందే. నాకు కావలసిన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం, మంచి వర్క్ తెలుసు.ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనకు మంచి పరిచయస్థులు, అందరితో బాగా కలిసిపోతారు. నాకు రామ్ చాలా దగ్గర వ్యక్తి. తను నన్ను ప్రారంభించాలి అని ఆహ్వానించడం నాకు విశేషమైనది. నాకు ఇప్పటి వరకు నా జీన్స్ వల్ల టెక్నాలజీ ఉపయోంచే అవసరం అంతగా రాలేదు కాని ఇటీవలే కాస్త ఉపయోగించవలసి వచ్చింది, అది కూడా రామ్ చేతుల మీదగానే జరిగింది. గతంతో పోలిస్తే ఎప్పటికప్పుడు రామ్ అప్డేట్ అవుతూ ఉంటారు, ఆ అప్డేట్ మార్పు ఇక్కడ చాలా ముఖ్యం" అన్నారు.
రామ్ కొణికి మాట్లాడుతూ..."అందరికి నమస్కారం.ఇప్పటి వరకు మేము హెయిర్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా స్కిన్ లోకి అడుగుపెడుతున్నాము.దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ సిటీలలో, అలాగే కొన్ని నగరాలలో ఎక్స్పాండ్ అయ్యే ఆలోచనలో ఉన్నాము. వైద్యుల నేతృత్వంలో పూర్తిగా ప్రొఫెషనల్స్ తో ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆధునిక సరికొత్త పరికరాలతో స్కిన్ కేర్ అనేది చేయబోతున్నాము. జగపతి బాబు గారి చేతుల మీదగా కొణికి లక్స్ ప్రారంభం కావడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆయనతో నా పరిచయం చాలా కాలం నాటిది. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో ఆయన క్యారెక్టర్ బట్టి కావాల్సిన విధంగా ఆయన హెయిర్ స్టైల్ మార్చడం జరుగుతుంది. దానికి ఆయన పూర్తిగా సహకారం అందిస్తారు. మేము చేసే ప్రతి పనిలో పూర్తిగా ప్రొఫెషనల్స్ ద్వారా చాలా జాగ్రత్తగా ఉంటాము" అన్నారు.
డాక్టర్ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ..."మేము ముఖ్యంగా ఈ ప్రాసెస్ లో సేఫ్టీ చూస్తాము.అలాగే ఒక వ్యక్తిగతమైన ప్రోటోకాల్ ప్రకారం ముందుకు వెళ్తాము.మా దగ్గర స్కిన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో సర్టిఫికేషన్ చేసిన ఆధునిక పరికరాలు ఉన్నాయి" అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







