IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- April 20, 2026
అహ్మదాబాద్: ఎట్టకేలకు ముంబై ఫామ్ లోకి వచ్చింది. నాలుగు వరుస ఓటముల తర్వాత గెలుపు సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. గుజరాత్ పై ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 రన్స్ టార్గెత్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 15.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 99 పరుగుల తేడాతో ముంబై విజయదుంధుబి మోగించింది.
ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇది రెండో విజయం. అటు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరు మీదున్న గుజరాత్ కు ముంబై షాక్ ఇచ్చింది. మూడు వరుస విజయాల తర్వాత ఓటమి పాలైంది గుజరాత్. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది మూడో పరాజయం.
గుజరాత్ తో మ్యాచ్ లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 90 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో వచ్చిన వర్మ.. చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 7 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో భారీ స్కోర్ (199) చేయగలిగింది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







