20 లక్షల వైద్య సహాయం అందించి మరోసారి తన గొప్ప మనసు చాటిన చిరంజీవి
- April 20, 2026
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం వెండి తెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతంగా నిలుస్తుందని మరోసారి నిరూపించారు. ఆయన దయ, సహాయస్ఫూర్తి ఆయనను రియల్ హీరోగా నిలబెడుతున్నాయి.
గుండెకి సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్.అంతే కాకుండా అపోలో ఆసుపత్రిలో వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు.
అదే సమయంలో తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు మెగాస్టార్. నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9.5 లక్షల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో జీవనాధారంగా నిలిచారు.
మొదట సినీ సంఘాల సభ్యులు సహాయం కోసం మెగాస్టార్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే పూర్తి బాధ్యత తీసుకుంటూ, అన్నీ తానే చూసుకుంటానని చెప్పారు. ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వైద్య బిల్లులపై రాయితీని ఇప్పించడానికి చిరంజీవి స్వయంగా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఫైనల్ బిల్లును కూడా స్వయంగా చెల్లించారు మెగాస్టార్.
ఒక వారం వ్యవధిలోనే మొత్తం 20 లక్షల రూపాయలను వైద్య సహాయంగా అందించిన చిరంజీవి, ఎందుకు కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారో మరోసారి నిరూపించారు.
ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పొందిన ₹10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు మెగాస్టార్. మరో 5 లక్షలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు విరాళంగా అందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన నిబద్ధతను ఆయన నిరంతరం కొనసాగిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి బిగ్ స్క్రీన్ పైనే కాదు, నిజజీవితంలో దయ, దానం, ఉదారతలో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







