డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- April 21, 2026
మనామాః బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ యూనిట్ ను సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షుడు అయిన కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సందర్శించారు. ఈ సందర్భంగా సైనిక సంసిద్ధతను పరిశీలించారు. జాతీయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంపై సమీక్షించారు. అంతకుముందు కింగ్ హమద్ కు రక్షణ దళ సర్వ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
కింగ్ హమద్ సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను మరియు సామర్థ్యాలను సమీక్షించారు. వారి పోరాట సామర్థ్యాన్ని ప్రశంసించారు.
బహ్రెయిన్ సైన్యం, భద్రతా సంస్థలు మరియు పౌర రక్షణ దళాలు దేశాన్ని కాపాడుతూ.. దేశ అభివృద్ధి ప్రస్థానానికి రక్షణ కవచంగా నిలుస్తున్నారని కొనియాడారు. జాతీయ భద్రతను కాపాడటంలోనూ, రాజ్యానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా దృఢంగా ఎదుర్కోవడంలోనూ వాటి కీలక పాత్ర పొషిస్తుందని తెలిపారు. బహ్రెయిన్ రక్షణ సిబ్బంది ప్రజల గౌరవాన్ని, నమ్మకాన్ని నిరంతరం పొందుతూనే ఉంటారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం నెలకొనాలని కింగ్ హమద్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







