ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- April 21, 2026
అమెరికా: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్‌కు కొత్త సీఈఓ రాబోతున్నారు. ఆపిల్ ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ 15ఏళ్ల తర్వాత తన పదవికి రాజీనామా చేయనున్నారు. చాలా కాలంగా కంపెనీ సీఈఓగా ఉన్న టిమ్ కుక్.. తన పదవి నుంచి వైదొలిగి ఆపిల్‌లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రను చేపట్టనున్నారు. రాబోయే సెప్టెంబర్ నెలలో టిమ్ కుక్ సీఈఓ (Tim Cook) పదవికి రాజీనామా చేయనుండగా, ఆ తర్వాత జాన్ టెర్నస్ ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు.
టిమ్ కుక్ సెప్టెంబర్ 1, 2026న ఆపిల్ సీఈఓ పదవి నుంచి వైదొలుగుతారు. సెప్టెంబర్ 1 నుంచి జాన్ టర్నస్ ఆపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. కుక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అవుతారు. జాన్ టర్నస్ 20 ఏళ్లకు పైగా ఆపిల్‌తో ఉన్నారు. కంపెనీ అనేక ప్రధాన ప్రొడక్టుల్లో కీలక పాత్ర పోషించారు.
సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న జాన్ టర్నస్ 2001లో ఆపిల్‌లో చేరారు. ఆయన ప్రొడక్ట్ డిజైన్ బృందంలో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2013లో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఆపై 2021లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు.
ప్రస్తుతం ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌తో సహా అన్ని ప్రధాన హార్డ్‌వేర్ ప్రొడక్టులను టర్నస్ పర్యవేక్షిస్తున్నారు. ఆపిల్ ప్రధాన ప్రొడక్టుల్లో జాన్ టర్నస్ కీలక పాత్ర పోషించారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తుల్లో కీలకంగా వ్యవహరించారు.
అలాగే, ఐఫోన్ 17 సిరీస్, కొత్త మ్యాక్ డివైజ్‌లపై కూడా పనిచేశారు. ఆపిల్ మ్యాక్ కంప్యూటర్లను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆపిల్‌లో జాయిన్ అవ్వడానికి ముందు వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో పనిచేశాడు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







