రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- April 21, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో NRI TDP టీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రియాద్ నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాలలో ఈ వేడుకలను నిర్వహించారు.
రియాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని, చిన్నారుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి) , మహేంద్ర వాకాటి, మోహన్ గురజాల, శివ దబ్బకూటి, ఖాదర్ షేక్, హరీష్, మణికంఠ, రవి మేడూరి, ప్రవీణ్ పోకూరి, వంశీ, రామ్ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు.
P4 స్పూర్తి - సేవా గుర్తింపు: ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన P4 స్ఫూర్తితో తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను, ప్రకాశం జిల్లా స్థాయిలో ఉత్తమ మార్గదర్శి గా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు గారి చేతుల మీదుగా సన్మానం, జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి గారి నుండి ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మహేంద్ర, శివ, మోహన్, ఖాదర్ షేక్ తదితర నేతలు మాట్లాడుతూ.. నవ్యాంధ్ర ప్రదేశ్ మరియు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలంటే చంద్రబాబు మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
కుర్ధుబా ప్రాంతంలో కార్మికులతో వేడుకలు:
రియాద్ వెలుపల ఉన్న కుర్ధుబా ప్రాంతంలో రాఘవేంద్ర చౌదరి N ఆధ్వర్యంలో గృహనిర్మాణ కార్మికుల సమక్షంలో వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో అన్నవరం బొల్లం, అంజి కేతా, అజ్మతుల్లాహ్ షేక్, పల్లివెళ్ళి వెంకటేశ్వరరావు, నేమాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
APNRTS సేవలు: విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు APNRTS ద్వారా అందుతున్న ఇన్సూరెన్స్ సదుపాయం ఎంతో భరోసానిస్తుందని రాఘవేంద్ర చౌదరి ఈ సందర్భంగా కొనియాడారు.
మే 2026లో మినీ మహానాడు: ఈ కార్యక్రమం ముగింపులో ఒక ముఖ్య ప్రకటన చేశారు.వచ్చే మే 2026 లో నిర్వహించబోయే మినీ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా జయప్రదం చేయాలని NRI TDP, SAUDI ARABIA టీం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వారు ప్రకటించారు.

తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







