తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- April 21, 2026
తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వ కమిటీతో జేఏసీ (JAC) జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే, కార్మికులు కోరుతున్న డిమాండ్ల పరిష్కారానికి కమిటీ నాలుగు వారాల సమయం కోరింది. దీనికి జేఏసీ ససేమిరా అనడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, కార్మిక సంఘాలు సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. విద్యా సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు సాగే సమయంలో బస్సులు నిలిచిపోవడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ (Pay Revision) అమలు చేయడం కార్మికుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. వీటితో పాటు పని ఒత్తిడి తగ్గించడం, ఇతర సౌకర్యాల కల్పనపై వారు పట్టుబడుతున్నారు. ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయని, తక్షణ హామీ లభిస్తే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని జేఏసీ స్పష్టం చేసింది. డిపోల వద్ద ఇప్పటికే నిరసన సెగలు మొదలయ్యాయి.
జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని RTOలకు రవాణాశాఖ ఆదేశించింది. ప్రైవేటు డ్రైవర్లు, వాహనాల వివరాలు సేకరించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. GHMCలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పింది. మానిటరింగ్ అధికారులను నియమించనుంది.
సడన్ గా బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారు, రోజువారీ కూలీలు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లు లేదా ఇతర వాహనాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, భారీ సంఖ్యలో ఉన్న బస్సు సర్వీసులను భర్తీ చేయడం సవాలుగా మారింది. పోలీసులు కూడా డిపోల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







