118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- April 22, 2026
రియాద్ః 2026 మొదటి త్రైమాసికంలో సౌదీ అరేబియా డెలివరీ రంగం బలమైన వృద్ధిని సాధించిందని 'ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ' (TGA) తెలిపింది. ఈ కాలంలో ఆర్డర్ల సంఖ్య 118 మిలియన్లను అధిగమించిందని, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం పెరుగుదలను సూచిస్తుందని ప్రకటించింది. డెలివరీ రంగంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధి కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంది. సాంకేతిక పరిష్కారాల వినియోగం పెరగడం, ఈ-కామర్స్ రంగం విస్తరించడం మరియు మరింత సమర్థవంతమైన నిర్వహణ మోడల్స్ ను ఫాలో కావడం ఈ అభివృద్ధికి దోహదపడ్డాయని ప్రకటించింది.
TGA గణాంక నివేదిక ప్రకారం.. మొత్తం ఆర్డర్లలో రియాద్ ప్రాంతం అత్యధిక వాటాతో (44 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మక్కా ప్రాంతం (22.21 శాతం), తూర్పు ప్రావిన్స్ (16.23 శాతం) నిలిచాయి. మదీనా ప్రాంతం 4.97 శాతంతో నాలుగవ స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అసిర్ ప్రాంతం (3.34 శాతం), ఖాసిమ్ ప్రాంతం (2.77 శాతం), తబూక్ ప్రాంతం (1.74 శాతం), హాయిల్ ప్రాంతం (1.66 శాతం) మరియు జాజాన్ ప్రాంతం (1.14 శాతం) నిలిచాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







