ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!

- April 22, 2026 , by Maagulf
ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!

యూఏఈః ఫ్లైయింగ్ టైగర్ (Flying Tiger) సంస్థకు చెందిన ఒక గ్లాస్ ఉత్పత్తిలో సీసం (lead) స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఆ ఉత్పత్తిని వాడొద్దని యూఏఈ ఆర్థిక వ్యవహారాల విభాగం హెచ్చరిక జారీ చేసింది. 2024-2025 కాలంలో విక్రయించబడిన, ఈ బ్రాండ్‌కు చెందిన 220 ml గాజు గ్లాసులను వినియోగదారులు వెంటనే వాడటం ఆపివేయాలని ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఆ ఉత్పత్తుల నంబర్లు 3057450, 3060031, 3052986, 3062993, 3055350, 3053912 అని తెలిపింది.  
ఈ ఉత్పత్తిపై బయటి వైపు ఉన్న ముద్రణలో (print) సీసం మరియు కాడ్మియం స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఇవి వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. వినియోగదారులు ఆ ఉత్పత్తిని వెంటనే పారవేసి, సురక్షితంగా నిర్మూలించాలని అధికారులు సూచించారు.  
ఇంతకుముందు, 'Flying Tiger Copenhagen' బ్రాండ్‌కు చెందిన 220 ml సామర్థ్యం గల 6,341 గాజు గ్లాసులను వెనక్కి తీసుకోవాలని (recall) సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వినియోగ సమయంలో ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

'Flying Tiger Copenhagen' సంస్థ గల్ఫ్ ప్రాంతంలో బలమైన మార్కెట్ ను కలిగి ఉంది. సరసమైన ధరలలో లభించే, విలక్షణమైన స్కాండినేవియన్ డిజైన్‌లకు ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com