కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- April 22, 2026
బెంగళూరు: బెంగళూరులో మానవత్వం మంటగలిసిపోయింది. ప్రేమించిన వాడు తనను పట్టించుకోవడం లేదనే కక్షతో ఒక యువతి అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, నమ్మించి, తాళ్లతో కట్టేసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది.
రాజాజీనగర్‌లోని టెలికాం స్టోర్‌లో పనిచేసే ప్రేరణ (27), కిరణ్ అనే యువకుడు గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తనను పెళ్లి చేసుకోడని ప్రేరణ అనుమానం పెంచుకుంది.మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరణ్‌ను అంజనపురలోని తన నివాసానికి పిలిపించింది. కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి, అతడి కళ్లకు గంతలు కట్టింది.కళ్లు కనిపించని స్థితిలో ఉన్న కిరణ్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, తాళ్లతో కట్టేసింది. ఆపై ఏమాత్రం కనికరం లేకుండా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అతను కేకలు వేస్తున్నా ఏమాత్రం చలించని ఆమె ఆ దృశ్యాన్ని తాపీగా సెల్ఫోన్లో రికార్డు చేసింది.
దీంతో కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నార్త్‌వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







