టాలీవుడ్‌లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- April 22, 2026
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. 1970 జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినీ రంగంలో ప్రముఖ రచయిత. ఎన్టీఆర్ నటించిన “అల్లూరి సీతారామరాజు” వంటి చిత్రాలకు ఆయన అందించిన సంభాషణలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ చిట్టిబాబు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే సినిమా నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా కూడా పలు సినిమాలు తీశారు. సినిమాల వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
ఇటీవలి కాలంలో చిట్టిబాబు ఒక సినీ విశ్లేషకుడిగా కూడా గుర్తింపు పొందారు. సినిమాల ట్రెండ్స్, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై టీవీ చర్చల్లో స్పష్టంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







