రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- April 22, 2026
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు కోర్టు ఊరట కల్పించింది. గత ఏడాది నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్‌లో ఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది.
ఈ కేసులో అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కస్టమ్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గత ఏడాది ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.
వాస్తవానికి రన్యా రావుకు 2025 మే నెలలోనే సాధారణ బెయిల్ లభించింది. అయితే స్మగ్లింగ్ నిరోధక చట్టాల కింద నమోదైన కేసుల కారణంగా ఆమె విడుదల కాలేకపోయారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు కూడా ఆమెపై నమోదయ్యాయి.
ఇప్పుడు ఆ చట్టంలోని కొన్ని కఠిన నిబంధనల నుంచి న్యాయపరమైన వెసులుబాటు లభించడంతో కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఏడాది తర్వాత ఆమె జైలు నుంచి బయటకు రానున్నారు.
ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన రన్యా రావు ఈ భారీ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె విడుదల అనంతరం ఈ కేసుపై ఏమి చెబుతారో అన్న ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







