'గోదారి గట్టుపైన' నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్
- April 23, 2026
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ‘గోదారి గట్టుపైన' నుంచి 'నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్ ఈ పాటకు మరింత ప్రాణం పోసింది.
ఈ సాంగ్‌లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్‌తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్‌ను ఎంతో సహజంగా చూపించారు. ఆ సన్నివేశాలు అందరికీ కనెక్ట్ అవుతున్నాయి. ఈ పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్ హిట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రాని సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - సుభాష్ చంద్ర
బ్యానర్ - రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత - అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మధులిక సంచన లంక
DOP - సాయి సంతోష్
సంగీతం - నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ - అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ - ప్రవల్య డి
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్ - ఫస్ట్ షో
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్‌లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్‌కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్‌కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







