'వాలా Ⅱ' తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: హీరో తేజ సజ్జా
- April 23, 2026
కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘వాలా 2’ తెలుగులో నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ హీరో తేజసజ్జా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో సూపర్ హీరో తేజసజ్జా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లో ఎంత జోష్ ఉందో, ఇక్కడున్న ఈ బాయ్స్ అందరిలో కూడా అంతే జోష్ కనిపిస్తోంది. మలయాళ నటీనటులకు మనం ఇస్తున్న వెల్కమ్ ఇదే. కొన్ని మలయాళ సినిమాలు చూసినప్పుడు చాలా క్రేజీగా తీశారని అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఏ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమాను మన ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. అలాంటి ఆడియన్స్ మధ్య నేను కూడా ఒక భాగంగా ఉండటం, ఈ సమయంలో నటుడిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం నిర్మాత సాహు గారు. ఆయన చాలా మంచి వ్యక్తి, హార్ట్‌ఫుల్‌గా ఉంటారు. అందరికీ మంచి జరగాలని కోరుకునే మనసు ఆయనది. అందుకే ఆయనకు ఇలాంటి సక్సెస్‌లు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఈ ఏడాది శంకర వరప్రసాద్ గారితో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మలయాళంలో పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ఆయన ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. సాహు గారు ఇతర భాషల్లోకి వెళ్లి సినిమాలు చేయడం చాలా మంచి పరిణామం. ఈ విషయంలో ఆయనకు తోడ్పడిన విపిన్ దాస్ గారికి థ్యాంక్యూ సో మచ్. డైరెక్టర్ గారికి, టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. తొలి సినిమాతోనే ఇంత భారీ హిట్ సాధించడం చాలా అరుదైన విషయం. ఏప్రిల్ 24న అందరూ థియేటర్లకు వెళ్లి ‘వాలా 2’ను చూడండి. మన తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఏమిటో వీరందరికీ పరిచయం చేద్దాం. మేము ప్రమోషన్స్ కోసం కేరళకు వెళ్లినప్పుడు అక్కడి ప్రేక్షకులు, మీడియా ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇది ఇప్పటికే సక్సెస్ అయిన సినిమా కాబట్టి, ఈ వేడుక కూడా ఒక సక్సెస్ సెలబ్రేషన్‌లా అనిపిస్తోంది. మనందరం కూడా షైన్ స్క్రీన్స్ బ్యానర్ విజయోత్సవంలో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్యూ సో మచ్.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. విపిన్ దాస్ గారిని కలిసినప్పుడు ఆయన సినిమాలు చూశాను. అలాంటి వాళ్లతో అసోసియేట్ అయితే మనం కూడా మంచి సినిమాలు తీయొచ్చని అనిపించింది. వాళ్ల ‘వాలా 1’లో నేను లేను, ‘వాలా 2’లో కలిస్తే బాగుంటుందని చెప్పాను. అందరూ పాజిటివ్‌గా స్పందించి నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అలా మలయాళ ఇండస్ట్రీలోకి వెళ్లాను. చాలా మంచి సినిమా తీశాం, ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. డైరెక్టర్ అద్భుతంగా త్యీశారు. మన తెలుగువారు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తారని భావించి ఈ మూవీని డబ్బింగ్ చేసి తీసుకోస్తున్నాం. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన తేజ సజ్జా గారు, గోపీచంద్ గారికి థాంక్స్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సాహు గారికి కంగ్రాచ్యులేషన్స్. ఏడాది తెలుగు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. మలయాళంలో పెద్ద బ్లాక్‌బస్టర్ సాధించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించిన యంగ్ స్టార్స్ అందరికీ అభినందనలు. జీవితం లో ఉండే భావోద్వేగాల గురించి ఈ సినిమా చెబుతుంది. తెలుగు ప్రేక్షకులు ఏ భాష సినిమా అయినా గుండెల్లో పెట్టుకుని చూస్తారు. ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేస్తారు. ‘వాలా 2’లో బ్రదర్ ఎమోషన్, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ చాలా బాగా ఉన్నాయి. ఈ సినిమా ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 24న రిలీజ్ అవుతోంది, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.
అలన్ మాట్లాడుతూ: ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాలంటే మాకు చాలా ఇష్టం. చాలా తెలుగు సినిమాలు చూశాను. అల్లు అర్జున్ గారి సినిమాలు, అలాగే ‘జెర్సీ’ నా ఫేవరెట్. ఏప్రిల్ 24న ‘వాలా 2’ మీ ముందుకు వస్తోంది. మలయాళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులో కూడా అదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నాను.
హషీర్ మాట్లాడుతూ: వాలా 2’ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఏప్రిల్ 24న థియేటర్‌కు వెళ్లి చూడండి. కేరళలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాము. మీ అందరి సపోర్ట్ కావాలి.
దేవరాజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవారు. మలయాళ సినిమాలను ఎంతో ఆదరిస్తారు. అలాగే మేము కూడా కేరళలో తెలుగు సినిమాలను సెలబ్రేట్ చేస్తాం. ‘వాలా 2’ కేరళలో పెద్ద విజయం సాధించింది. ఇది ఒక యూత్‌ఫుల్ స్టోరీ. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. అందరూ ఈ సినిమాను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడాలని కోరుకుంటున్నాను.
అజిన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘వాలా 2’ చాలా మంచి సినిమా. కేరళలో మంచి విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
విపిన్ దాస్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నేను డైరెక్ట్ చేసిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా చూసి ఆదరించారు. ‘వాలా 1’ కూడా మీకు నచ్చింది. ఈసారి ఇంకా పెద్దగా ప్లాన్ చేశాము. మలయాళంలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకి తెలుగు ప్రొడ్యూసర్ వుండటం ఆనందంగా ఉంది. సాహు గారు వరుస విజయాలు సాధిస్తున్నారు. ‘వాలా 2’ కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ సావిన్ SA మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాలు చూశాను. అల్లు అర్జున్ గారి సినిమాలు నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమాలు నాకు ఇన్స్పిరేషన్. మా టీమ్‌లో అందరూ తెలుగు సినిమాల అభిమానులే. ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను.
డైరెక్టర్ సాగర్ కె చంద్ర మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. సాహు కి మరో హిట్ రాబోతోంది. ఆయన హిట్ మిషన్‌లా మారిపోయారు.ఇలా విజయాలు కొనసాగాలని కోరుకుంటున్నాను. ‘వాలా 1’ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ‘వాలా 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తెలుగులో కూడా మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నాను. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తాజా వార్తలు
- పెట్టుబడి ఒప్పందాలు వేగంగా అమల్లోకి రావాలి: సీఎం రేవంత్
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్‌కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్‌లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!









