ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!

- April 23, 2026 , by Maagulf
ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!

దుబాయ్: దుబాయ్ కొత్తగా ప్రకటించిన మెట్రో గోల్డ్ లైన్, దాని మార్గంలో ఉన్న కమ్యూనిటీలలో ఆస్తి ధరలు మరియు అద్దెలను 30 శాతం వరకు పెంచుతుందని ప్రముఖ డెవలపర్లు మరియు రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్‌ లు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా స్టేషన్లకు సమీపంలో ఉన్న ఇళ్లకు 10 నుండి 25 శాతం వరకు ప్రీమియం లభించవచ్చని, అద్దె రేట్లు 15 నుండి 30 శాతం వరకు పెరగవచ్చని వారు పేర్కొన్నారు.  

డాన్యూబ్ ప్రాపర్టీస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ రిజ్వాన్ సజన్ మాట్లాడుతూ.. దుబాయ్ దీర్ఘకాలిక పట్టణాభివృద్ధి వ్యూహంలో గోల్డ్ లైన్ మరో మైలురాయి అని అన్నారు. ఇది ఆస్తి విలువలను మెరుగుపరచడం మరియు ఈ కారిడార్ వెంబడి వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని గణనీయంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లనుందని ఆయన అన్నారు. చారిత్రాత్మకంగా మెట్రో స్టేషన్లకు 10-15 నిమిషాల నడక దూరంలో ఉన్న ఆస్తులు 10 నుండి 25 శాతం వరకు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ప్రీమియంలను పొందుతున్నాయని సజన్ పేర్కొన్నారు.

దుబాయ్‌లో మెట్రోకు సమీపంలో ఉన్న ఆస్తులు చారిత్రాత్మకంగా 20-30 శాతం విలువ ప్రీమియంలను పొందుతున్నాయని, నిర్మాణ దశలలో 18-25 శాతం విలువ పెరుగుదల మరియు నిర్మాణం పూర్తయ్యాక మరింత పెరుగుదల కనిపిస్తుందని హెచ్‌ఆర్‌ఈ డెవలప్‌మెంట్ వైస్-ఛైర్మన్ డాక్టర్ హసన్ హిజాజీ అన్నారు. అద్దెల విషయానికొస్తే, మెట్రో-అనుసంధానిత ఆస్తులు నిలకడగా నిలకడగా ఉన్నాయని,  తుది వినియోగదారుల డిమాండ్ ఆధారంగా పెరుగుదలను తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 

ప్రెస్కాట్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షహీర్ తబానీ మాట్లాడుతూ.. ఇప్పటికే అధిక గిరాకీ ఉన్న బిజినెస్ బే మరియు దుబాయ్‌ల్యాండ్ వంటి ప్రాంతాలు, మెట్రో ప్రవేశం రియల్ ఎస్టేట్ సామర్థ్యానికి ఒక కొత్త మార్గాన్ని తెరవడంతో మరింత ఆకర్షణీయంగా మారనున్నదని  పేర్కొన్నారు.  మెట్రో స్టేషన్లకు 500 మీటర్ల పరిధిలోని ఆస్తులు, ఒక కిలోమీటరు దూరంలో ఉన్న వాటితో పోలిస్తే ప్రస్తుతం 18 నుండి 25 శాతం అధిక ధరలను కలిగి ఉన్నాయని, అద్దెలు 15 నుండి 30 శాతం వరకు ఎక్కువగా ఉండవచ్చని మార్కెట్ డేటాను తబానీ ఉదహరించారు.

గోల్డ్ లైన్ సెప్టెంబర్ 2032లో పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. మీనా రషీద్, సిటీ వాక్, బిజినెస్ బే, మహమ్మద్ బిన్ రషీద్ సిటీ, నాద్ అల్ షేబా, మహమ్మద్ బిన్ రషీద్ గార్డెన్స్, మైదాన్, అల్ బర్షా సౌత్, మరియు జుమేరా విలేజ్ సర్కిల్ (JVC) వంటి అనేక ప్రముఖ అభివృద్ధి ప్రాజెక్టులను కలుపుతూ.. 15 వ్యూహాత్మక ప్రదేశాలకు విస్తరించనుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com