అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- April 23, 2026
యూఏఈ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల విధానంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వే ఫలితాలను అబుదాబి పర్యావరణ సంస్థ (EAD) వెల్లడించింది. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి మరియు అధిక ప్లాస్టిక్ వినియోగం ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఒక వ్యూహాత్మక చర్యగా ఈ విధానాన్ని EAD 2020లో ప్రారంభించింది.
ఈ విధానం ప్రారంభమైనప్పటి నుండి మెరుగైన ఫలితాలు సాధించారు. వాటిలో 47 కోట్లకు పైగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించారు. ప్రధాన రిటైల్ అవుట్‌లెట్లలో వీటి సంఖ్యను 95 శాతం వరకు తగ్గించినట్లు ప్రకటించారు. సుమారు 2,67 కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ ను నేరుగా ఇళ్ల నుండి లేదా ఎమిరేట్ అంతటా ఉన్న 170కి పైగా స్మార్ట్ రీసైక్లింగ్ యంత్రాల ద్వారా సేకరించినట్టు పేర్కొంది.
మొత్తం యూఏఈపై సానుకూల ప్రభావాన్ని చూపేందుకు ఎమిరేట్ చేపట్టిన మార్గదర్శక కార్యక్రమాలలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది సమాఖ్య స్థాయిలో ప్లాస్టిక్ ఉత్పత్తులపై జాతీయ నిషేధానికి మరియు నియంత్రణకు దోహదపడిందని తలిపారు.
ఇదంతా 7,386 టన్నుల ప్లాస్టిక్‌ను డంపింగ్ స్థలాలకు మళ్లించకుండా నిరోధించడానికి సహాయపడిందన్నారు. ఈ విధంగా నివారించబడిన ఉద్గారాలు, ఒక సంవత్సరానికి 1,85,000 ఇంధనంతో నడిచే వాహనాలను రోడ్ల నుండి తొలగించిన దానికి సమానమని అంచనా వేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన జాతీయ ప్లాస్టిక్ నిషేధానికి అనుగుణంగా మరియు ఒక్కసారి వాడి పారేసే ఉత్పత్తుల వ్యాపారాన్ని నియంత్రించడానికి EAD పనిని అభివృద్ధి చేసే సన్నాహంలో భాగంగా, ఈ ఏజెన్సీ ఒక సర్వేను నిర్వహించింది.
ప్లాస్టిక్‌ల వల్ల పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం గురించి ప్రజలలో అవగాహన గణనీయంగా పెరిగిందని ఫలితాలు తెలిపారు. ఈ సర్వేలో 126 దేశాలకు చెందిన 5,000 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో 96 శాతం మంది, ప్లాస్టిక్ పర్యావరణానికి కలిగించే ప్రమాదాల గురించి తమకు అవగాహన ఉందని చెప్పారు. 96 శాతం మంది రోజువారిగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించినట్లు తెలిపారు.
EAD సెక్రటరీ జనరల్ డాక్టర్ షేఖా సలేం అల్ ధహేరి మాట్లాడుతూ.. ఈ సర్వే ఫలితాలు, సమాజ సభ్యులలో పర్యావరణ అవగాహనను పెంచడానికి ఏజెన్సీ చేసిన ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







